తెలంగాణ రాష్టంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అక్టోబర్ మొదటి వారంలో మొదలు కానున్నాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్ రాజకీయంగా కీలకమైన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నియోజక వర్గాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నారట. మొదట రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఈ పర్యటన ప్రారంభిస్తారట. మరో 14 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజక వర్గాలుగా పర్యటించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.