Home / TECHNOLOGY / భారతదేశపు తొలి డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్

భారతదేశపు తొలి డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్

చోదకుడి అవసరం లేని కార్ల గురించి వినే ఉంటారు. కానీ డ్రైవర్‌ అవసరం లేని ట్రాక్టర్‌ను తొలిసారిగా మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రదర్శించింది. ఇది విపణిలోకి రావడానికి వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందేనట. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీలో ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. 20 – 100 హెచ్‌పీ శ్రేణి ట్రాక్టర్లను విడుదల చేస్తామని, ఇవన్నీ విపణిలోకి రావడానికి సమయం పడుతుందని చెప్పింది. ‘ఈ వినూత్న ఉత్పత్తి వ్యవసాయ తీరును మార్చివేస్తుంది. ఉత్పాదకతను పెంచుతుంది. ప్రపంచ అవసరాలకు కావలసిన ఆహార ఉత్పత్తికి ఇది బాగా ఉపయోగపడుతుంద’ని మహీంద్రా అండ్‌ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ ట్రాక్టర్‌ను విపణిలోకి దశల వారీగా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

    ‘గతేడాది మేం ప్రారంభించిన ‘డిజిసెన్స్‌’ సాంకేతికత ఈ చోదక రహిత ట్రాక్టరుకు అత్యున్నత స్థాయి మేథస్సును అందించిందని, భారతీయ రైతులకు గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చుతుందని అంచనా వేస్తున్న’ట్లు ఎం అండ్‌ ఎం ప్రెసిడెంట్‌(వ్యవసాయ పరికరాల విభాగం) రాజేశ్‌ జేజురకర్‌ పేర్కొన్నారు. ఈ సాంకేతికతను త్వరలోనే అన్ని మహీంద్రా ట్రాక్టర్లలోకి చొప్పించనున్నామనీ ఆయన వివరించారు. ‘అమెరికా, జపాన్‌ వంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ దీనిని తీసుకెళ్లనున్నాం. దీంతో మహీంద్రా ట్రాక్టర్లు ప్రపంచ వ్యాప్తంగా గట్టి పోటీనివ్వడానికి సిద్ధపడుతున్నాయ’న్నారు.

స్టీరింగ్‌ను దానంతట అదే తిప్పుకుంటుంది(ఆటో స్టీర్‌), పొలంలో వరుస లైన్ల అనంతరం తిరిగి పక్క వరుసలోకి వెళ్లుతుంది. అది కూడా ఎటువంటి కమాండ్‌ ఇవ్వకుండానే(ఆటో హెడ్‌ల్యాండ్‌ టర్న్‌), దూరం నుంచే ట్రాక్టర్‌ ఇంజిన్‌ను స్టార్‌ చేయవచ్చు. నిలిపివేయవచ్చు.(రిమోట్‌ ఇంజిన్‌ స్టార్‌-స్టాప్‌)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat