ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జన సేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ అవార్డు వచ్చింది .ఈ క్రమంలో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) ఎక్స్‌లెన్స్ అవార్డుకు పవన్ కళ్యాణ్ ఎంపికయ్యారు. అయితే ఈ పురస్కారాన్ని నవంబర్ నెల 17న హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్ కు ప్రదానం చేయనున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీ పవన్ కల్యాణ్‌ను గౌరవించిన సంగతి విదితమే.తాజాగా ఈ ప్రతిష్ఠాత్మక ఎక్స్‌లెన్స్ అవార్డు వరించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఏటా గ్లోబల్ బిజినెస్ మీట్ సందర్భంగా ఈ అవార్డుతో ఐఈబీఎఫ్ గౌరవిస్తోంది. ఈ సారి పవన్ కల్యాణ్‌ను అవార్డుతో సత్కరించాలని నిర్ణయించింది.
నటుడిగా, రాజకీయ నాయకుడిగా కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న పవన్‌కు ఈ ఏడాది ఎక్స్‌లెన్స్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఐఈబీఎఫ్ ఇండియా విభాగం అధిపతి సునీల్ గుప్తా, సమన్వయకర్త చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు పవన్‌ను కలిసి ఆహ్వానాన్ని కూడా అందించారు.