ప్రస్తుతం మొబైల్ డేటా రంగలో అన్నిటిని వెనక్కి నెట్టి మరి మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ జియో నెట్వర్క్ను వాడుతున్న వారికి అందులో ఉన్న ముఖ్యమైన ప్లాన్ల గురించి తెలుసు. ప్రధానంగా కొన్ని ప్లాన్లు లాంగ్ వాలిడిటీ ఉండడంతో వాటినే ఎక్కువ మంది రీచార్జి చేసుకుంటుంటారు. అయితే నిజానికి అవే కాదు, వినియోగదారులకు పనికొచ్చే పలు ఇతర ప్లాన్లు కూడా జియోలో ఉన్నాయి. అవేమిటి అంటే ..?
రూ.11, రూ.51, రూ.91, రూ.201, రూ.301 ప్లాన్లు వినియోగదారులకు జియోలో అందుబాటులో ఉన్నాయి. రూ.11తో రీచార్జి చేసుకుంటే 100 ఎంబీ డేటా వస్తుంది. 35 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. అదే రూ.51తో రీచార్జి చేసుకుంటే 1 జీబీ డేటా లభిస్తుంది. 175 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. రూ.91 రీచార్జితో 2 జీబీ డేటా, 325 నిమిషాల వాయిస్ కాల్స్ వస్తాయి. రూ.201తో 5 జీబీ డేటా, 725 నిమిషాల వాయిస్ కాల్స్, రూ.301తో 10 జీబీ డేటా, 1000 నిమిషాల వాయిస్ కాల్స్ వస్తాయి.