ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ నోరు ఎన్నిసార్లు జారిందో తనకే లెక్కలేదు.. మైక్ పట్టుకున్నప్పుడల్లా నోరు జారడం సోషల్ మీడియాకి అడ్డంగా బుక్ అవ్వడం లోకేష్ పొలిటికల్ లైఫ్‌లో భాగమైపోయాయి. సైకిల్ గుర్తుకు ఓటేస్తే తడిగుడ్డతో గొంతుకోసుకున్నట్టే అన్నా.. రాష్ట్రంలో కులపిచ్చి ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే అని చెప్పినా.. జయంతి రోజున వర్ధంతి అని నాలుక కరిచినా.. ఇంత చిన్న వయసులో అంత ఙ్నానం ఎలా వచ్చిందని నెటిజన్లు సోషల్ మీడియాలో నిద్రహారాలు మాని చర్చలు మీద చర్చలతో రచ్చ రచ్చ చేశారు.
అయితే చివరికి తేలిన విషయం ఏంటంటే లోకేష్‌కి ప్రత్యేకమైన ఙ్నానం ఏం లేదని అది తన తండ్రి నుండి వచ్చిన వారసత్వ సంపద అని ఒక నిర్ణయాని వచ్చారు.. అయితే ఇదే విషయాన్ని అక్షరాల నిజం చేస్తున్నారు చంద్రబాబు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే అని డప్పు కొట్టినా.. అసెంబ్లీ సాక్షిగా ఏపీని అవినీతిలో నెంబర్‌వన్‌గా నేనే నిలబెట్టా అని వాగినా.. అది మాత్రం సోషల్ మీడియాలో సంచలనమే.. అంతేకాదు బాబు రౌడీయిజం పలుకులు చెప్పాలంటే ఆయన మాట్లాడినప్పుడల్లా సోషల్ మీడియా ఆడేసుకుంటుంది. నేను ఇస్తున్న ఫించెన్లు, నేను వేయించిన రహదారులు, నా రేషన్, నా వల్ల ఎంతమంది లాభం పొందుతున్నారో.., వారంతా తిరిగి తమకే ఓటెయ్యాలని.. బెదిరించాలన్నా అది ఒక్క చంద్రబాబుకే సాధ్యం. ఇలా తండ్రీ కొడుకులిద్దరు నోరు జారి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి పోటీపడుతుంటారు.