ఏపీలో అవినీతి అక్రమాలు ఎంతగా జరుగుతున్నాయో ఇటు తెలుగు మీడియా దాచిపెట్టిన కానీ అటు నేషనల్ మీడియా కథలు కథలుగా కథనాలను ప్రచురిస్తున్నాయి .అంతే కాకుండా గత మూడున్నర ఏండ్లుగా రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల అవినీతి జరిగింది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .టీడీపీ అవినీతి గురించి ఏకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబు కరప్షన్ పేరిట పుస్తకాన్ని కూడా రీలీజ్ చేశారు .
ఈ క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ,మంత్రే స్వయంగా ఏపీలో అధికార పార్టీ నేతలు పలు అవినీతి అక్రమాలు చేస్తోన్నారు అని మీడియా సాక్షిగా విరుచుకుపడ్డారు .ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ “రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ పేరిట దోచుకుతింటున్నారు అని తీవ్ర ఆరోపణలు చేశారు .
ఈ క్రమంలో అవుట్ సోర్సింగ్ పేరిట కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .దీనికోసం ఏకంగా అధికార పార్టీకి చెందిన నేతలు ,కాంట్రాక్టర్లు ,వారి బినామీలు కోట్లాది రూపాయల అవినీతికి తెర తీశారు అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అని మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .మంత్రిగా ఉంటూనే ప్రభుత్వంలోని అక్రమాలు, అవినీతిపై విమర్శలు చేస్తూ వచ్చిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు… అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీపైనా తీవ్ర ఆరోపణలు చేశారు.