పాలు, చేపలు. ఇవి రెండూ మనకు మంచి పౌష్టికాహారంగా ఉన్నాయి. చాలా మంది చేపలను ఇష్టంగా తింటారు. అయితే చేపలను తినని వారు చాలా మంది పాలు తాగుతారు. ఈ క్రమంలో చేపలను తినే వారు, పాలు తాగేవారికి ఎప్పటి నుంచో ఓ సందేహం ఉంటూ వస్తున్నది. చేపలు తిన్నాక పాలు తాగవచ్చా లేదా అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే దీనికి ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం పాలు మన శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి. అయితే చేపలు మాత్రం హీటింగ్ ఎఫెక్ట్‌ను కలగజేస్తాయి. ఈ క్రమంలో రెండింటినీ ఒక దాని వెంట ఒక తీసుకుంటే దాంతో శరీరంలో రియాక్షన్ ఏర్పడుతుంది. దీని వల్ల రక్తం ఇన్‌ఫెక్షన్‌కు గురై చర్మ సంబంధ వ్యాధులు వస్తాయని ఆయుర్వేదం చెబుతున్నది. కనుక ఈ రెండింటినీ ఒకేసారి తీసుకోకూడదు.
అయితే చేపలు మాత్రమే కాదు, చికెన్, మటన్ తిన్నాక కూడా పాలను తాగకూడదు. ఎందుకంటే అన్నింటిల్లోనూ ఉండే ప్రోటీన్ శరీరానికి పెద్ద ఎత్తున అందుతుంది కనుక అది జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో గ్యాస్, అజీర్తి వస్తాయి. ఇక గుండె జబ్బులున్న వారు ఇలా తినడం ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.