ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పరిణామాలు ఆ పార్టీలో పలు ప్రకంపనలకు కేంద్రబిందువు అయ్యాయి .ఈ క్రమంలోదివంగత మాజీ మంత్రి – కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ వర్గీయులు సైకిల్ ఎక్కడంతో జిల్లా టీడీపీలో గత మూడు దశాబ్దాలుగా ఉన్న క్యాడర్ లో ఎక్కడ లేని తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది .
ఈ క్రమంలో జిల్లాలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్సలు జీర్ణించులేకపోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో సత్సంబంధాలున్నాయి కాబట్టి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని విజయవాడలో జోరుగా చర్చ జరుగుతోంది .ఈ క్రమంలో అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గన్నవరంలో వైసీపీ తరపున పోటీచేసి గెలవాలనే ఆలోచనలో వంశీ ఉన్నారు అని వంశీ వర్గీయులు అంటున్నారు .
అంతే కాకుండా మరోవైపు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని , విజయవాడలో ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కూడా వంశీకి మంచి స్నేహితులుగా ఉన్నందున వంశీ త్వరలోనే విజయవాడలో భారీ ఎత్తున సభ నిర్వహించి జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరనున్నారని రాజకీయవర్గాలు జోస్యం చెపుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ఉన్న కేసులు ప్రభుత్వ తీరుపై ఉన్న ఇతర ఆరోపణల నేపధ్యంలో వైసీపీలోకి భారీ వలసలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి .ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ నియోజక వర్గంలో పర్యటిస్తూ ఆయన మీడియాతో మాట్లాడుతూ “తమ నియోజక వర్గ సమస్యలను పరిష్కరించకుండా ఇలాగే ఉంటె వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం కష్టం .ఎందుకంటే రాష్ట్రమంతటా అలాగే ఉంది .ఇలాయితే మేము వేరే పార్టీ చూసుకోవాల్సి వస్తోంది అని ఆయన పరోక్షంగా చంద్రబాబుకు పార్టీ మారడం ఖాయం అని సంకేతాలు ఇచ్చారు .ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం జిల్లా టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి .