తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు విద్య వైద్య రంగాల్లో పలు మార్పులను తీసుకువస్తోన్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలో వైద్య రంగాన్ని ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రులను మోడల్ ఆస్పత్రులుగా తయారుచేస్తుంది .దీనిలో భాగంగా పశు వైద్యాస్పత్రులను కూడా సర్కారు ఆధునికరిస్తుంది .రాష్ట్ర వ్యాప్తంగా సంచార పశు వైద్యశాల అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది .ఆ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సంచార పశు వైద్యశాల అంబులెన్స్ జెండా ఊపి ప్రారంభించారు .
