తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రముఖ ప్రొఫెసర్ కంచె ఐలయ్య వివాదం గురించి మాట్లాడుతూ ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైశ్యులపై ఐలయ్య రాసిన పుస్తకం సమంజసంగా లేదన్నారు. కంచె ఐలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధించాలని తమ మనోభావాలను దెబ్బతిన్నాయని వైశ్యులు వినతిపత్రం ఇచ్చారని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం తరపున కూడా ఐలయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. ‘‘ఒక కులాన్ని దూషించడం అనేది ఇది ఏ ఒక్కరికి తగదు. ఏ మేధావి కూడా ఐలయ్య వ్యాఖ్యలను, పుస్తకాలను ఆమోదించరు. కులాన్ని బట్టి గుణాన్ని నిర్ణయించలేము. ఐలయ్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే వారికే మంచిది’’ అని మంత్రి హరీష్‌రావు అన్నారు .
