తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో నిజామాబాద్ ఎంపీ కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారురు. గవర్నర్ నరసింహన్ సతీమణి విమల, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సతీమణి విమల, మంత్రి హరీశ్ రావు సతీమణి శ్రీనిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, మహిళాభివృద్ధి సంస్థ చైర్మన్ గుండు సుధారాణి, ప్రగతి భవన్ మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
