కర్నూలు జిల్లాలోని గోస్పాడు మండలం ఎం.చింతకుంట్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వెన్నపూస మహానందిరెడ్డి(72) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయనకు ముగ్గురు కొడుకులు ఉండగా, వీరు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులుగా ఉన్నారు. ఆయనకు విశ్వేశ్వరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, నాగిరెడ్డి సంతానం. మొదటి నుంచి భూమా నాగిరెడ్డి కుటుంబానికి ముఖ్య అనుచరులుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేసేవారు. మహానందిరెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సంతాపం తెలిపారు. చింతకుంట్ల గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహానందిరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు.
