Home / MOVIES / రెండు రోజుల్లోనే రికార్డు సృష్టించిన జూనియర్ ..

రెండు రోజుల్లోనే రికార్డు సృష్టించిన జూనియర్ ..

నాన్నకు ప్రేమతో ,టెంపర్,జనతా గ్యారేజ్ మూవీలతో వరస హిట్లతో మంచి ఊపులో ఉన్న టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవ కుశ తో మరోసారి తన సత్తా చాటాడు. తన సినిమా కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా జూనియర్ త్రిపాత్రాభినయం చేయడమే కాకుండా ..మొట్ట మొదటిసారిగా ఒక పాత్రలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తుండటంతో ఇటు నందమూరి అభిమానుల్లో అటు సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి .

ఈ మూవీ రీలీజ్ కు ముందు అభిమానులు ,సినిమా ప్రేక్షకులు పెంచుకున్న అంచనాలను జూనియర్ రీచ్ అవుతూ విడుదల అయిన తొలిరోజే రికార్డ్ కలెక్షన్లు సాధించింది. మొన్న గురువారం విడుదలై ఓవర్ సీస్ తో కలుపుకొని తొలిరోజే 49
కోట్లకు పైగా గ్రాస్ చేరుకుంది .ఇక రెండో రోజు అయిన నిన్న శుక్రవారం కూడా అదే సత్తాను చాటుతూ మొత్తం రెండు రోజుల్లోనే అరవై కోట్లను క్రాస్ చేసింది .

అంతే కాకుండా మొదటి రెండు రోజుల్లోనే ఓవర్ సీస్ లో మిలియన్ మార్క్ ను కూడా అందుకోవడం ఎన్టీఆర్ కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా “జై లవకుశ “నిలిచింది .అయితే వరస సెలవులు కావడంతో ఈ మూవీ వారం రోజుల్లోపే వంద కోట్ల క్లబ్ లో చేరిపోతుంది అని సినీ విశ్లేషకులు అంటున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat