తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశంలోని ఏ రాజకీయ నాయకుడు కానీ అధికారంలో ఉన్న ఎవరు కూడా తీసుకోలేని ..ఇప్పటివరకు ప్రకటించలేని నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి విదితమే .వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగను అని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే .ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హమీను నెరవేర్చే దిశగా సంబంధిత అధికారులు పగలు అనక రాత్రి అనక పని చేస్తోన్నారు .
ఈ క్రమంలో భద్రాది-కొత్తగూడెం ,ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ పనులను రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పరుగులు పెట్టిస్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు .దీనిలో భాగంగా జిల్లాలో బచ్చోడు గ్రామంలో మంత్రి తుమ్మల మిషన్ భగీరథ పనుల్లో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు .
తదనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో బతుకమ్మ పండగను పురష్కరించుకొని ప్రభుత్వం ఇస్తోన్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక మహిళలకు మంత్రి తుమ్మల బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు .తదనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ పండగక్కి కొత్త బట్టలతో బతుకమ్మ ఆడాలని ..పండగను సంబరంగా చేసుకోవాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరను ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా ఇస్తున్నారు అని అన్నారు ..