ఏపీ రాజకీయాల్లో సంచలనాలకి మారు పేరు అయిన జేసీ దివాకర్ రెడ్డి ముక్కు సూటిగా మాట్లాడే తత్వం..ప్రతిపక్షానికి అయినా, స్వపక్షానికి అయినా అప్పుడప్పుడు చురకలు అంటించడం జేసీ నైజం. ఎప్పుడు సంచలన నిర్ణయాలని తీసుకునే జేసి దివాకర్ రెడ్డి.. తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఇప్పటికే జేసీ స్టేట్‌మెంట్‌తో తల పట్టుకున్న చంద్రబాబు బ్యాచ్‌కి మరో షాక్ ఇచ్చారు జేసీ. జేసీని ఎలైగైనా బుజ్జగించాలని ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. అయితే తన రాజీనామాపై వెనక్కు తగ్గడం లేదు ఈ టీడీపీ ఎంపీ.
ఇక చాగల్లు రిజర్వాయర్‌కు నీరు విడుదల చేసినంత మాత్రాన సరిపోదని, దానికి జీవో విడుదల చేయాలని జేసీ డిమాండ్ చేశారు. జీవో విడుదల చేయకపోతే తాను రాజీనామా నుంచి వెనక్కు వెళ్లబోనని కూడా స్పష్టం చేశారు. తాను విజయవాడకు వెళ్లి ఎవరితో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని జేసీ కుండబద్దలు కొట్టారు. తాను కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి లాంటి వారినే ఎదుర్కొన్నానని, ఇలాంటి చెత్త వాళ్లను ఎదుర్కొనలేకపోవడమేంటని ప్రశ్నించారు. అనంతపురం అభివృద్ధికి తాను కష్టపడతుంటే అధికారులతో పాటు నేతలెవ్వరూ తనకు సహకరించడం లేదన్నారు. దీంతో జేసీ తాజా ప్రకటన చంద్రబాబు అండ్ బ్యాచ్‌కి మైండ్‌బ్లోయింగ్ షాక్ ఇచ్చిందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.