ఏపీలో వైసీపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రారంభించిన వైఎస్సార్ కుటుంబం ఎలా సాగుతుందో తెలుసుకునేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభమైన వెంటనే జగన్ లండన్ పర్యటనకు వెళ్లడంతో ఇంటింటికి ప్రచార కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమై 11 రోజులు పూర్తై ఇప్పటికి 38 లక్షల మంది వైఎస్సార్ కుటుంబంలో చేరినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీ సీనియర్లు మరియు ముఖ్య నేతలతో జగన్ నిర్వహించిన సమీక్షలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులు పై సమీక్ష జరిపారు.
అంతే కాకుండా భవిష్యత్ కార్యాచరణపై పార్టీ సీనియర్లు మరియు ముఖ్య నేతలకు వై ఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఏపీ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించాలనే భావనతో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమైంది. సెప్టెంబర్ 11న వైఎస్సార్ కుటుంబం ప్రారంభమైందని, ఇప్పటికి 38 లక్షల మంది వైస్సార్ కుటుంబంలో చేరడం శుభపరిణామం అన్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో వైసీపీ శ్రేణులు కూడా ఊహించని విధంగా రెస్పాన్స్ రావడంతో వైసీపీ వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏపీలో వైఎస్సార్ కుటుంబంకు వస్తున్న రెస్పాన్స్‌ను చూచి చంద్రబాబు అండ్ బ్యాచ్‌కి మైండ్ బ్లాక్ అవుతోంది. ఇంటింటా తెలుగుదేశం పేరుతో అధికార టీడీపీ చేపట్టిన కార్యక్రమానికి పెద్దగా ఎవరూ రెస్పాండ్ అవకపోవడంతో చంద్రబాబు కూడా బాగా అప్‌సెట్ అయ్యారని.. నంద్యాల ఉప ఎన్నిక గెలుపు తర్వాత ఏపీ మొత్తం టీడీపీ హవా కొనసాగుతుందని భావించిన తెలుగు తమ్ముళ్లకి బిత్తరపోయే షాక్ తగిలిందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.