ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధికారంలోకి వస్తుందా ..?.గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న అవినీతి అక్రమాలపై ..ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న ప్రధాన ప్రతిపక్ష నేత ..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా ..?.ఇప్పటికే అవినీతిలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నింపిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమా ..?అంటే అవును అనే అంటున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలు .విషయానికి వస్తే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా నూట డెబ్బై ఐదు నియోజక వర్గాల్లో ఎక్కువ నియోజక వర్గాలలో వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొంది తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ఆ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి జోస్యం పలికారు చెప్పారు . వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని అన్నారు . నియోజక వర్గంలో బలిజకండ్రిగలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను వైసీపీ కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేయాలని ఆయన కోరారు. వైసీపీ నవరత్నాల గురించి అవగాహన కల్పించాలన్నారు.