తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎంతో బలంగా ఉన్న అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత మూడున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి పరుగులు పెట్టిస్తూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలతో సహా మాజీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,కింది స్థాయి క్యాడర్ కారు ఎక్కుతున్న సంగతి విదితమే .తాజాగా ఒక వార్త తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతుంది . అదే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరతారు .
గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు చేస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు తోడూ రానున్న పదేండ్ల పాటు అధికార పార్టీకి తిరుగు లేదు అనే రాజకీయ వర్గాల ఇన్నర్ టాక్ తో బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి .ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన చట్టంలోని హామీలతో పాటుగా ,రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న తమ అధిష్టానం విఫలం కావడం కూడా వీరికి రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు నెలకొన్నాయి .
అంతే కాకుండా పార్టీలో ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం ఉన్న కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను వద్దు అని బ్రతిమలాడిన కానీ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు షా ,ప్రధాని మోదీ తనను పక్కనపెట్టడంతో వీళ్ళు ఈ నిర్ణయానికి వచ్చారు అని సమాచారం .అందుకే తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే డాక్టర్ కె లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఆరు నెలలో తెలంగాణ భవన్ కు టులెట్ పడుతుంది అని వ్యాఖ్యానించిన సంగతి విదితమే .ఈ క్రమంలో గతంలో కూడా టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “రాష్ట్రంలో మరో ఏడాదిలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది .నేను ఇక్కడే ఉంటాను .ఎక్కడికి పోను .మీ వెంటే ఉంటాను అని బీరాలు పలికాడు .బాబు ఇలా మాట్లాడాడో లేదో కానీ టీడీపీ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరడం ..ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తట్టా బుట్టా సర్దుకొని ఏపీకు తరలిపోవడం అన్ని జరిగిపోయాయి .సో ఇప్పుడు కూడా లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు చూస్తోన్నారు అని అర్ధమవుతుంది అని రాజకీయ వర్గాలు విశ్లేసిస్తున్నాయి ..