తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ అంగుళానికి నీళ్లు ఇస్తామన్నారు. భవిష్యత్ లో 5వేల టీఎంసీల నీటిని ఏపీ, తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నామని.. ఏపీలోని అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని కేసీఆర్ చెప్పారు.
See Also : పీఆర్సీపై త్వరలోనే సమావేశం.. సీఎం కేసీఆర్
సెక్రటేరియట్ భవనాన్ని, అసెంబ్లీ భవనాన్ని కట్టాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ నెల 27న కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలకు భూమి పూజ చేస్తామని తెలిపారు. సెక్రటేరియట్ భవనాన్ని ఉన్న చోటునే కట్టాలని నిర్ణయించామని చెప్పారు. 5-6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో సచివాలయం కడతాం. రూ.400 కోట్ల వ్యయం లోపే సచివాలయం పూర్తవుతుంది. రూ.100 కోట్ల ఖర్చుతో అసెంబ్లీ పూర్తవుతుంది. ఇప్పుడున్న అసెంబ్లీని హెరిటేజ్ భవనంలా కాపాడుతాం. తూర్పు ముఖంగా అసెంబ్లీ నిర్మాణం చేపడతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
See Also : చంద్రబాబుపై జగన్ ఫైర్..బాబుకి ముచ్చెమటలు !
See Also : దేశంలోనే తొలిసారిగా”రేవంత్ రెడ్డి”..!