ప్రముఖ నటి సోనాలి బింద్రే తన అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ రోజు (బుధవారం) తన అభిమానులతో ఓ చేదు వార్తను పంచుకున్నారు. తాను హై గ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు, ప్రస్తుతం చికిత్స కోసం న్యూయార్క్ వెళ్తున్నట్లు తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు.
see also:కన్నడ సినిమా సెట్‌లో మంత్రి కేటీఆర్
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బుధవారం తన స్నేహితులు, అభిమానులతో ఈ వార్తను పంచుకున్నారు. తను కోలుకోవాలని కోరుకుంటూ గత కొద్ది రోజులుగా ఎంతో మంది ఆత్మీయతో సందేశాలు పంపుతున్నారని చెప్పిన సోనాలి, వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. తాను ఓ యుద్దానికి సిద్ధమవుతున్నానని, తన కుటుంబం, స్నేహితులే తనకు బలమని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
see also:యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు పేరు ఇదే..ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడి
బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించిన సొనాలి బింద్రే, మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మురారి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్‌హీరోల సరసన నటించి మెప్పించారు. తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించిన సోనాలి 2004 తరువాత సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సొనాలి పలు హిందీ రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.