తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్-2018 ని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వం సెయిలింగ్ కు ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఛాంపియన్ సెయిలర్లకు హైదరాబాద్ సెయిలింగ్ పోటీలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు.
see also:కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి సంచలన వాఖ్యలు..!!
ఇక్కడ పోటీల్లో పాల్గొన్నవారు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నారని ప్రశంసించారు.ఈ ఏడాది నుండి హైదరాబాద్ సెయిలింగ్ వీక్.. సీనియర్ మల్టీ క్లాస్ సెయిలింగ్ ఛాంపియన్ షిప్-2018 గా ప్రకటించారు.సెయిలింగ్ పోటీలు జరగనున్న హుస్సేన్ సాగర్ వండర్ ఫుల్ లేక్ అని మంత్రి కేటీఆర్ చెప్పారు. జంట నగరాలు గత 32 సంవత్సరాలుగా సెయిలింగ్ పోటీలకు వేదికగా నిలుస్తున్నాయని తెలిపారు.
Minister @KTRTRS participated in the opening ceremony of Hyderabad Sailing Week at Sailing Annexe, Hussain Sagar, Hyderabad. pic.twitter.com/L6UHD8y8bv
— Min IT, Telangana (@MinIT_Telangana) July 3, 2018