గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్రంలోని నేతలే కాకుండా దేశంలోని ప్రముఖ నేతలు ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణలోని ప్రతీ ఒక్కరికి సురక్షిత తాగునీటిని అందించబోతున్న సీఎం కేసీఆర్ కు హాట్సాఫ్ అంటూ కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి రమేష్ చంద్రప్ప జిగజిగాని ప్రశంసించారు.. మిషన్ భగీరథ స్పూర్తితో దేశంలోని ప్రతీ ఇంటికి నల్లాతో నీళ్లు ఇచ్చే పథకాన్ని చేపడతామనిఅయన చెప్పారు.
see also:సెయిలింగ్ కు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నాం..మంత్రి కేటీఆర్
ఇవాళ సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మిషన్ భగీరథ నిర్మాణాలను రమేష్ చంద్రప్ప పరిశీలించారు. ముందుగా సంగారెడ్డి జిల్లా బోరుపట్ల లోని హెడ్ వర్క్స్ ను చూసారు. తాగునీరు శుద్ధి అయ్యే విధానాన్ని Rws&s ఈఎన్.సి సురేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి కి వివరించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తో కలిసి హెడ్ వర్క్స్ లోని ప్రతి విభాగాన్ని రమేష్ చంద్రప్ప పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను చూశారు. సంగారెడ్డి సెగ్మెంట్ లో తాగునీటి సరాఫరా తీరును తెలిపే ఫ్లో డయాగ్రామ్ ను చూసారు.
ఆ తర్వాత మీడియా తో మాట్లాడిన రమేష్ చంద్రప్ప,చాలారోజుల నుంచి భగీరథ ను చూడాలనుకుంటున్నానని ఇవాల్టి తో ఆ కోరిక తీరిందన్నారు. తాను ఇప్పటిదాకా ఎన్నో తాగు నీటి పథకాలను చూశానని అయితే రాష్ట్రం మొత్తానికి ఒకేసారి నీళ్లు అందించే ఇలాంటి భారీ పథకాన్ని ఎక్కడా చూడలేదన్నారు.యావత్ దేశానికి మిషన్ భగీరథ మోడల్ అన్నారు. ఆతర్వాత మాట్లాడిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి, తెలంగాణ ప్రజల దుప తీరుస్తున్న అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అన్నారు. అక్కడి నుంచి మెదక్ జిల్లా రామచంద్రపురం వెళ్లిన కేంద్ర మంత్రి, ఇంటింటికి ఇచ్చిన నల్లా కన్నెక్షన్స్ ను పరిశీలించారు. నల్లాలో సరాఫరా అవుతున్న నీటిని తాగారు. చాలా బాగా ఉన్నాయని మెచ్చుకున్నారు. ఆతర్వాత సంగారెడ్డి జిల్లా పెద్దారెడ్డిపేట్ దగ్గర నిర్మించిన ఇంటెక్ వెల్, హెడ్ వర్క్స్ ను చూశారు.
see also:కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి సంచలన వాఖ్యలు..!!
మీడియా తో మాట్లాడారు. మంచి పని ఎవరు చేసినా మెచ్చుకోవాలన్నారు. మిషన్ భగీరథ కోసం సీఎం కేసీఆర్ పడుతున్న తాపత్రయం అభినందనీయమన్నారు. కేంద్ర నిధులతో సంభందం లేకుండానే ఇంత భారీ ప్రాజెక్ట్ ను చేపట్టడం సాహసం అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల కృషి తో సీఎం కేసీఆర్ అనుకున్నది సాధిస్తున్నారని చెప్పారు.మిషన్ భగీరథ పై కేంద్ర మంత్రుల స్థాయిలో చర్చ జరుగుతోందని చెప్పారు. దేశం లో ఉన్న తాగునీటి కష్టాలకు చెక్ పెట్టాలంటే మిషన్ భగీరథ లాంటి పథకమే శరణ్యం అన్నారు. ఈ దిశగా కేంద్రం ఇప్పటికే ఆలోచించిందన్నారు. అయితే ఇందుకు 5 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయన్నారు. తన స్వంత రాష్ట్రం కర్ణాటకలో మిషన్ భగీరథ లాంటి పథకం కోసం గత సీఎం సిద్ధరామయ్య తో చర్చించానని, త్వరలోనే కర్ణాటక RWS&S అధికారులను తెలంగాణకు పంపిస్తామని చెప్పారు.
see also:ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి నమూనాలను పరిశీలించిన మంత్రి తుమ్మల