ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్వర్యంలో గత నాలుగేళ్ళుగా విభజన చట్టంలో హామీలను నెరవేర్చకుండా ..ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ఇవ్వకుండా ఐదున్నర కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా అనంతపురం జిల్లా కేంద్రంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఒక చిన్నారి తన పాటతో ఆకట్టుకుంది.
see also:లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ -మంత్రి పుల్లారావు ..!
వైసీపీ అsధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే చిన్నారి చేతనకు ప్రాణం.. జననేతపై ఉన్న అభిమానంతో ప్రభుత్వం నిరంకుశ పాలనపై పాటపడి వినిపించింది. ‘ఏలేటోళ్లకు ఎక్కడ చూసిన పచ్చగా కనిపిస్తుందంటే.. పసుపు పచ్చ అని అందామా.. కామెర్ల రోగమని అందామా’అని అంటూ తన పాటతో గత నాలుగు ఏళ్ళ టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనను వివరించింది.