మీరు చదివింది నిజమే .స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఒప్పేసుకున్నారు .గతంలో అసెంబ్లీ సాక్షిగా దేశంలో అవినీతిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని నిజం ఒప్పుకున్నా సంగతి తెల్సిందే .
see also:వన్య ప్రాణులను వేటాడి..హెరిటేజ్ వాహనాల్లో తరలింపు ..!
తాజాగా ఆడవారిపై జరుగుతున్నా నేరాల్లో నెంబర్ వన్ స్థానంలో రాష్ట్రముందని ఆయన అన్నారు .నిన్న సోమవారం రాష్ట్రంలో విజయవాడలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర హోం గార్డుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడవారిపై అత్యాచారాలు ..టీజింగ్ ..ఇంట్లో వేదింపులు ,ఆఫీస్లలో లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి అని ఆయన వాపోయారు.
see also:తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్..సీనియర్ నేతలు రాజీనామా
అర్ధరాత్రి ఆడవారు ఇంటికి క్షేమంగా చేరుకున్నప్పుడే స్వాతంత్రం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ అన్నారు అని కానీ నేడు ఆ విధంగా పరిస్థితులు లేవు .పట్టపగలే ఇంట్లో ..వీధిలో ..బడిలో ..ఆఫీస్ లలో ఇలా ఎక్కడబడితే అక్కడ ఆడవారిపై దారుణాలు జరుగుతున్నాయి అని ఆయన వాపోయారు .
see also:చంద్రబాబు నిరుద్యోగ భృతి కాదు.. అవి కావాలి..పవన్ కల్యాణ్