ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 204వ రోజుకు చేరుకుంది. కాగా, జగన్ చేస్తున్న పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమై వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గ ఓదావరి జిల్లాల్లో పూర్తిచేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జగన్ వెళ్లిన ప్రతీ చోటా.. ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు సమస్యలను చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో జగన్‌కు అందజేస్తున్నారు.
see also:కొడుకు భవిష్యత్తుకోసం.. ౩౦ ఏళ్ళ టీడీపీ పార్టీకి మాజీ సీనియర్ మంత్రి గుడ్ బై..!
అయితే, జగన్ ఇవాళ ముమ్మిడివరం నియోజకవర్గంలో తన పాదయాత్రను ముగించుకుని రామచంద్రాపురం నియోకవర్గంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 200 మీటర్ల పొడవు ఉన్న ఎదుర్లంక బ్రిడ్జీ మీదుగా రామచంద్రాపురం నియోజకవర్గంలోకి జగన్ ప్రవేశించబోతున్నారు. జగన్ వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
see also:కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్..ముహూర్తం ఖరారు..!!
ఇదిలా ఉండగా, జగన్ తన పాదయాత్ర ద్వారా తమ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్నారని తెలుసుకున్న రామచంద్రాపురం నియోజకవర్గం ప్రజలు ఘన స్వాగతం పలికారు. జగన్ కటౌట్‌తోపాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సోదరి షర్మిల కటౌట్ దర్శనమిచ్చింది. ఇలా రామచంద్రాపురం నియోజకవర్గం ప్రజలు స్వాగతం పలకడంతో జగన్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలనకు ధన్యవాదాలు తెలిపారు.