తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు ఇవాళ సంచలన తీర్పునిచ్చింది.ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.టీచర్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్‌జెడిలు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.ఉమ్మడి జిల్లా డీఈవోలకు బదిలీల అధికారాన్ని కోర్టు తొలగించింది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన వెబ్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే.
