తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది.త్వరలోనే హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.అమీర్ పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు నడవనుంది.అందులోభాగంగానే ఇప్పటికే ట్రయల్ రన్, టెక్నికల్ పనులను పూర్తి చేసుకోగా, జూలై నెలాఖరున మెట్రోను పట్టాలెక్కించేందు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
see also:ఉత్తమ్ వెన్నులో వణుకు పుట్టే సవాల్ విసిరిన కేటీఆర్..!!
ఈ క్రమంలోనే ఈ నెల 27న LB నగర్-అమీర్ పేట్ రూట్ లో మెట్రో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.16 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రూట్ లో రైళ్ల రాకపోకలకు అవసరమైన సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, ట్రాక్షన్ వ్యవస్థ ఏర్పాటు వంటి పనులన్నీ పూర్తయ్యాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ రూట్ లో మెట్రోను ప్రారంభించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్(HMR )సన్నాహాలు చేస్తోంది .