ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అనారోగ్యం బాగోలేదంటూ కారణాన్ని షాకుగా చూపిస్తూ టీడీపీ ఏర్పాటు నుండి పార్టీలో ఉంటూ వస్తోన్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ను బాబు మంత్రి వర్గం నుండి తప్పించిన సంగతి తెలిసిందే .అంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర జాతీయ కమిటితో పాటుగా జాతీయ కమిటిని ప్రకటించిన సంగతి విదితమే .ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కళా వెంకట్రావు తో పాటుగా కమిటిలో 105 మంది సభ్యులతో సరికొత్త కమిటిని ప్రకటించాడు.
see also:చరిత్రను తిరగరాసిన వైఎస్ జగన్..!
దీంతో మంత్రి పదవి నుండి తప్పించిన సమయంలో ఆయన పలు మీడియా సమావేశాల్లో బహిరంగంగానే బాబు తీరును దుయ్యబట్టారు . గతంలో పార్టీలో సీనియర్ నేతలకు తగిన గౌరవం లేదు .మధ్యలో వచ్చిన వారికీ ఉన్న ప్రాధాన్యత గత మూడు దశాబ్దాలుగా పార్టీకోసం అహర్నిశలు పనిచేసిన తమలాంటి సీనియర్ నేతలకు లేకుండా బాబు చేస్తూ పార్టీ సిద్ధాంతాలను గంగలో తొక్కాడు అంటూ అప్పట్లో లేఖ కూడా రాశాడు .అంతే కాకుండా పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు అంటూ అవినీతి ఆరోపణలు వచ్చిన వారికీ మంత్రి పదవులు ఉంచి తమలాంటి సీనియర్ నేతలకు అనారోగ్యాన్ని షాకుగా చూపించి మంత్రి పదవి నుండి తప్పించాడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బొజ్జల ఆ తర్వాత ఇటు పార్టీ అటు ప్రభుత్వకార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తోన్నారు .
see also:కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్..ముహూర్తం ఖరారు..!!
ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు టీడీపీలో జరిగిన అవమానాన్ని తన అనుచరులు బోజ్జలకు చెప్పారంట.సీనియర్లకు పార్టీలో సరైన గౌరవం లేదుకాబట్టి..ఇందులో ఉండి అవమానాలు ఎదుర్కునే బదులు పార్టీ మారడం మంచిదని బోజ్జలకు తన అనుచరులు చెప్పడంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు .వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వరని తెలిసి తన తనయుడు అయిన బొజ్జల సుధీర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వైసీపీ లో చేరాలని ..అది కూడా త్వరలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కల్సి జగన్ సమక్షంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు బొజ్జల .