వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 201వ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన పాదయాత్ర ఏపీ వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పాదయాత్ర ఒక ఎత్తయితే.. ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న పాదయాత్ర మరో ఎత్తు. ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్‌కు లభించిన ప్రజల ఆదరాభిమానాలు.. ఇప్పటి వరకు ఏ రాజకీయ నేతకు లభించలేదని రాజకీయ విశ్లేషకులే అభిప్రాయపడుతున్నారు.
see also:మీ పని కావాలంటే రూ.10,000-25వేలు కమీషన్ ఇవ్వాల్సిందే-టీడీపీ ఎమ్మెల్సీ..!
ఇదిలా ఉండగా, జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రను దృష్టిలో ఉంచుకుని పలు పేరుమోసిన సంస్థలు చేసిన ఎన్నికల సర్వేల్లో టీడీపీకి ప్రతికూలంగా.. వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇలా సర్వే ఫలితాలను అంచనా వేసిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు జగన్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో వైసీపీలోకి వలసలు పెరిగాయి.
see also:ఇక మేటర్ లేదనుకోవాల్సిందే.. భయ్యా..!
టీడీపీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి తనయుడు, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ యర్రా నవీన్ కూడా జగన్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఈ మేరకు తన అనుచరవర్గంతో మంతనాలు కూడా జరిపారని, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎండా విజయకేతనం ఎగురవేస్తుంది కనుక.. వైసీపీలో చేరితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తన అనుచర వర్గం సలహా ఇచ్చిందట. దీంతో టీడీపీలో కాపు నేతగా ఉన్న ఎర్రా నవీన్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యేందుకు సమాయత్తం అవుతున్నారట. ఏదేమైనా ఇటీవల కాలంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరుగుతుండటంతో అధికార పార్టీ నేతల్లో ఆందోళన పెరిగిందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.