వ్యక్తిగత ప్రయోజనాల కోసం.. ప్రజా సంక్షేమాన్ని తాకట్టు పెట్టే ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా..? అంటే అది ఒక్క ఏపీ సీఎం చంద్రబాబు మాత్రమే అన్నారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఓట్లేసిన ప్రజలకు, స్నేహానికి విలువ ఇవ్వని రాజకీయ నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు.
see also:ఎన్టీఆర్ ఎప్పుడో చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని చెప్పాడంటా
చంద్రబాబు వస్తే బాగుండు అని 2014 ఎన్నికల సమయంలో కథనాలు రాసిన విలేకర్లను కూడా పట్టించుకోని దుర్మార్గుడు చంద్రబాబు అని, కనీసం, తన కోసం కుక్కలాగా కాపలా కాసిన తనను కూడా చంద్రబాబు చివరకు మోసం చేశాడని మోత్కుపల్లి వాపోయారు. వైఎస్ జగన్‌పై అక్రమంగా కేసులు బనాయించిన..
see also:జగన్ కే ఓటేయండి..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు..!!
వాటన్నిటినీ మొగోడిలా ఎదుర్కొంటున్నాడని, కానీ, నీవు మాత్రం సుమారు 20 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని.. న్యాయ స్థానంకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నావంటూ చంద్రబాబుపై ఫైరయ్యారు. అరే దొరకని దొంగా… నువ్వే కనుక మొగోడివైతే.. నీతి వంతుడవైతే.. నీ మీద ఉన్న కేసులన్నిటిని ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటకు రావాలని మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబుకు సవాల్ విసిరారు.