రేణు దేశాయ్ తన ట్విట్టర్ నుంచి సెలవు తీసుకున్నా.. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మాత్రం టచ్‌లోనే ఉన్నారు. నిశ్చితార్థం తరువాత పవన్ కళ్యాన్ అభిమానుల నుంచి వచ్చిన కమెంట్స్కు కొంత మనస్థాపం చెందినా.. ఆ వెంటనే కోలుకొన్న రేణుదేశాయ్ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. రెండో వివాహం తరువాత పవన్ కల్యాణ్‌తో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయా..? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. తమ ఇద్దరి సంతానం కోసమైనా పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉండి చర్చించక తప్పదని రేణుదేశాయ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, పిల్లల విషయంలో వేరే ఆప్షన్ లేదని తెలిపింది.
see also:అద్దిరిపోయే రేంజ్లో ఎన్టీఆర్ చిత్రం బిజినెస్..!
సెలవులు వచ్చినప్పుడు, ఏదైనా పండుగ వచ్చినప్పుడు పంపాల్సి ఉంటుంది కాబట్టి.. పవణ్తో కేవలం మాటలు మాత్రమే ఉంటాయని తేల్చేసింది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పడం. అందుకు స్పందించిన రేణుదేశాయ్ కృతజ్ఞతలు చెప్పడం ఇవన్నీ కూడా అభిమానులకు ఉన్న సందేహాలను పోగొట్టాయి.