తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు.ఈ సందర్బంగా అయనరూ.553.98 కోట్ల అంచనావ్యయంతో 33 వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు చేపడుతున్న గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు . జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల పరిధిలోని 15 గ్రామాలు దశాబ్దాలుగా సాగునీటికి నోచుకోవడం లేదు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం సమీపాన ఉన్నా.. అంతకంటే సుమారు 33 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భూములకు కృష్ణాజలాలు అందడం లేదు.
see also:తెలంగాణ అభివృద్ధిపై యూ.ఏ.ఈ విదేశాంగ మంత్రి ప్రశంసలు
ఈ నేపథ్యంలో రైతాంగం ఇదివరకటి ప్రభుత్వాలకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనే గట్టు రైతుల ఇక్కట్లను చూసిన నాటి ఉద్యమ నాయకుడు, నేటి సీఎం కేసీఆర్.. తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీటి కష్టాలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చినమాట మేరకు ప్రభుత్వం రూ.558.98 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది. పాలనాపరమైన అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలో శుక్రవారం సీఎం కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించనున్నారు.