విభజన హామీల అమలుకై ప్రతిపక్ష నేతలు, వైసీపీ నేతలు పోరాటం ఉదృతం చేశారు. కడప ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ కోసం జిల్లా వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టారు. ఉక్కు మహా ధర్నాలు, బంద్‌లు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యలోనే గురువారం కూడా తమ పోరాటాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నేతలు ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుల మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఓట్ల కోసమే జిల్లా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని వైసీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్ బాబు విమర్శించారు.
see also:జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న “టీడీపీ ఎమ్మెల్సీ కుటుంబం”..!
పార్లమెంట్‌లో ఏరోజు ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడని సీఎం రమేష్ దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 10 రోజులుగా దీక్ష చేస్తున్నా ఎంపీ చలాకీగా ఉండటం వెనుక రహస్యాన్ని వెల్లడించాలని, ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల మద్దతుతో దీక్షలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు విభజన హామీల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఎంపీలు పలుసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని, ఆమరణ దీక్షకు పూనుకున్న విషయాన్ని గుర్తుచేశారు. చివరకు ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేశారని చెప్పారు.
see also:బెజవాడలో సీఎం కేసీఆర్ కు ఏపీ కేసీఆర్ అభిమానులు భారీ స్వాగతం ..!
అంతేకాదు చంద్రబాబు కనుసన్నల్లోనే దీక్ష జరుగుతోందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిపోయిందని విమర్శించారు. టీడీపీ దీక్షకు అధికారులను, ఉద్యోగులను తరలించడం ఏంటని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలు చేస్తున్న నిరాహార దీక్ష నయవంచన దీక్ష అని ఎద్దేవా చేశారు. సాధారణ ప్రజలు 10 రోజుల పాటు దీక్షచేయలేరని, అలాంటిది బీపీ, షుగర్ ఉన్న సీఎం రమేష్ ఎలా చేస్తున్నారని నిలదీశారు. సీఎం రమేష్ తాగే వాటర్ బాటిల్ ఖరీదు మూడు వేల రూపాయలు ఉంటుందని ఆరోపించారు.