“బ్రాహ్మణుల అమ్మాయి.. నవాబుల అబ్బాయి” ప్రస్తుతం ఎక్కడ చుసిన ఈ షార్ట్ ఫిల్మ్ గురించే మాట్లాడుకుంటున్నారు.ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కాకముందే వివాదాలు చుట్టుముడుతున్నా యి.ఈ షార్ట్ ఫిల్మ్‌పై తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని లాలాగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
see also:
ఇది బ్రాహ్మణుల మనోభావాలను కించపరచేలా ఉందని కొంతమంది బ్రాహ్మణులు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ షార్ట్ ఫిల్మ్ బ్రాహ్మణులను అవమానించేలా, లవ్ జీహాద్‌ను ప్రేరేపించే విధంగా ఉందని బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి.
see also:ప్రకాష్ రాజ్‌ను హత్య చేసేందుకు భారీ కుట్ర..!
చంచల్ శర్మ సమర్పించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు ఫారూక్ రాయ్ దర్శకత్వం వహించారు. దీని ట్రైలర్‌ను యూట్యూబ్ లో విడుదల చేశారు. మనుషులకంటే మతం గొప్పదేమీ కాదని సందేశం ఇచ్చినట్లు కనిపిస్తోంది.మరోవైపు ఇది మానవత్వానికి సంబంధించిన సినిమా అని షార్ట్ ఫిల్మ్ టీమ్ చెబుతోంది.