ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే చాలు రాజకీయ నాయకులకు పండగే పండగ అనుకోండి. గెలుపు ఓటమిలను పక్కన పెడితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు, అధిష్టానం తమకు టికెట్ ఇస్తుందా లేదా అన్న క్లారిటీ తెచ్చుకుంటారు. ఆ తర్వాత తమ ఫ్యూచర్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తుంటారు రాజకీయ నాయకులు.ముఖ్యంగా చెప్పాలంటే ఏపీ ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలోకి విపరీతంగా వలసలు వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ సీనియర్ నాయకులందరు పాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసున్నారు. ఇక తాజాగా బీజేపీకి చెందిన పురందేశ్వరి కూడా వైసీపీపార్టీలో చేరేందుకు సర్వం సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
see also:చంద్రబాబుకి గాలి జనార్ధనరెడ్డి సవాల్..!
మాజీ కేంద్ర మంత్రి.. దివంగత సీఎం ఎన్టీఆర్ తనయ… దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా, మహిళా నేతగా కొనసాగుతున్నారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఆమె.. 2014 ఎన్నికల సమయానికి బీజేపీలో చేరిపోయారు. విభజనను సాకుగా చూపుతూ.. కాంగ్రెస్‌లో ఉంటే భవిష్యత్తు ఉండదనే అభిప్రాయంతో అదే విభజనకు సహకరించిన బీజేపీలో చేరిపోయారు.. అయితే ఆమెకున్న పలుకుబడితో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఎంపీగా గెలిస్తే హడావుడి చేసేవారెమో కానీ…
see also:7గురు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా ..!కారణం ఇదే ..!
ఆమె ఓటమి పాలయ్యారు. బీజేపీలో ఉన్న మహిళా పదవి దక్కినా.. ఆమెకు ఆశించినంత ప్రాధాన్యత లభించకపోవడం ఒక వైపు, బీజేపీ ఏపీలో బలపడకపోవడంతో ఇప్పుడు పురంధేశ్వరీ వైసీపీ పార్టీ వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇది ఇప్పటి నుంచే ఎన్నో నెలలుగా ప్రచారం సాగుతుంది. తాజ సమచారం ప్రకారం విజయవాడ లేదా విశాఖపట్నం నుండి పోటి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. విశాఖ నుంచి వైసీపీకి బలమైన అభ్యర్థి లేరు ఒక వేళ ఆమె వైసీపీలో చేరితే వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయ్యాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. ఇక జగన్ కూడా ఆమెకు వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటును ఇచ్చేందుకు రెడిగా ఉన్నారని తెలుస్తోంది.