ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ,ఎనిమిది మంది ఎంపీలు గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రలోభాలకు లొంగి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.
see also:చంద్రగిరి టీడీపీ పార్టీ ఇంచార్జ్ పదవీకి అరుణ గుడ్ బై..!
తాజాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గత నాలుగు ఏళ్ళుగా పోరాడిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఇటివల తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసి మరి వాటిని స్పీకర్ చేత ఆమోదింపచేసుకున్నారు.తాజాగా రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపుతున్న కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఏడు మంది ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాదరెడ్డి మీడియాకు తెలిపారు .
see also:“2000”మందితో వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త”ఆర్కే”.
అయితే ఉక్కుపరిశ్రమ కోసం పోరాడుతున్నామని గబ్బలు చరుచుకుంటున్న టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా దమ్ముంటే రాజీనామా చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అని ఆయన సవాలు విసిరారు ..