తాను చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తొలిరోజు నుంచే ప్రజల ముఖాల్లో రాబోయే రేపటి ఆశలను చూశానని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత , వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ చేస్తున్న పాదయాత్ర 200వ రోజు మైలురాయికి చేరుకున్న సందర్భంగా వైఎస్ జగన్ ట్విటర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ఈ మైలురాయి చేరుకున్న సందర్భంగా.. తనపై ఎంతో నమ్మకం ఉంచిన ఏపీ ప్రజలకు జగన్ ధన్యవాదాలు తెలియజేశారు. రాజన్య రాజ్యాన్ని (దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ పాలనను) ఏపీలో తిరిగి తీసుకొచ్చి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే తన సంకల్పమని జననేత వైఎస్ జగన్ తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు.
see also:వైఎస్ జగన్‌పై సోషల్ మీడియాలో వైరల్ న్యూస్..!
కాగా, నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ఎండకడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్‌కు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నేడు (బుధవారం) ప్రజాసంకల్పయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా వైఎస్ జగన్ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పాదయాత్ర మరో కీలక మైలురాయి చేరుకోవడంతో తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరాగా… అశేష ప్రజానీకం మధ్య రాజన్న తనయుడు వైఎస్ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మంగళవారం నాటికి తన పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ 2,434.2 కిలోమీటర్లు నడిచారు.
Hope, of a better tomorrow. This is what I've seen on people's faces, since Day 1. As I complete 200 days of #PrajaSankalpYatra, I express my gratitude to the people of AP for their faith in me.
I'm determined to restore Rajanna's Rajyam & bring back the smiles on your faces!— YS Jagan Mohan Reddy (@ysjagan) June 27, 2018