ఏపీలోని కురుపాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పుష్పాశ్రీవాణి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.నిత్యం తన నియోజకవర్గంలో పర్యటిస్తూ..ప్రజలతో మమేకమవుతూ..తనను ఎన్నుకున్న ప్రజల భాధలను తీరుస్తూ..ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ కురుపాం నియోజకవర్గంలో శ్రీవాని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
see also:పవన్ సంచలన ప్రకటన..కేసీఆర్‌ను త్వరలో కలుస్తా
ఈ క్రమంలోనే ఆమె తన మానవత్వాన్ని చాటుకుంది.వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే శ్రీవాని ఇవాళ నియోజకవర్గంలో పర్యటన అనంతరం ఇంటికి వెళ్ళుతున్న సమయంలో దారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనను గమనించిన ఎమ్మెల్యే శ్రీవాని తన వాహనాన్ని ఆపించి పరామర్శించారు.అంతేకాకుండావెంటనే 108కి ఫోన్ చేసి ఆసుపత్రికి పంపించారు.మరికొంతమందిని తన వాహనంలో సమీపంలోని ఆసుపత్రికి పంపించి దగ్గరుండి మరీ వైద్యం చేపించారు.ఎప్పటికప్పుడు పరిస్థితి ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అయితే ఎమ్మెల్యే స్పందన పట్ల స్థానికులు ప్రశంసల జల్లు కురిపించారు.తన వాహనాలో ఎక్కించుకొని వెళ్లి దగ్గరుండి వైద్యం చేపించడం పట్ల హ్యట్సాఫ్ అంటూ కొనియాడుతున్నారు.