తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. రాష్ట్రంలోని 4 లక్షల గొల్ల, కురుమ కుటుంబాలకు 75శాతం సబ్సిడీతో ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కామారెడ్డి నియోజకవర్గంలో వచ్చే నెల 2 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
see also:రేపు విజయవాడకు సీఎం కేసీఆర్
ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మాసాబ్ ట్యాంక్ లో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై జిల్లా పశువైద్యాధికారులకు ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. గతేడాది మొదటి విడతలో చోటుచేసుకున్న పొరపాట్లు జరుగవద్దని అధికారులకు మంత్రి తలసాని సూచించారు. గొర్రెల పంపిణీలో కొందరు పశువైద్యులు బాగా చేశారని తలసాని అన్నారు.