ఏపీలో రాజకీయ పరిణామాలు క్షణానికో మలుపు తిరుగుతున్నయి.ఈ నేపథ్యంలో గతంలో ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.
see also:“2000”మందితో వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త”ఆర్కే”.
ఈ క్రమంలో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ గా ఉన్న అమె ఆ పదవీకి రాజీనామా చేశారు.అంతే కాకుండా రానున్న ఎన్నికల్లో కూడా తను బరిలోకి దిగను అని ఆమె ప్రకటించారు.
see also:మాజీ డీజీపీ సాయంతో వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!
అయితే గత కొంత కాలంగా పార్టీ పదవీ నుండి తప్పించాలని చూస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయంతో బాబు పని సులభమైంది. ఇప్పటికే ఆమె వైసీపీలో చేరతారు అని వార్తలు కూడా వస్తున్న సంగతి తెల్సిందే..ఆమె తనయుడు గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా ఉన్న సంగతి తెల్సిందే.