దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా నిర్మితమవుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. రూ. 184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 754.38 మీటర్ల పొడవుగల బ్రిడ్జి నిర్మాణ పనుల్లో పునాధులు (ఫౌండేషన్లు), ఉప నిర్మాణాలు (సబ్-స్టక్చర్లు) పూర్తికాగా సూపర్ స్టక్చర్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని బరూచ్ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్ బ్రిడ్జి ఇప్పటి వరకు అతి పెద్దదిగా ఉంది. దుర్గం చెరువుపై నిర్మాణం పూర్తయితే దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రికార్డు సృష్టించనుంది.
see also:ఆసుపత్రి బెడ్ మీద నుంచే అధికారులతో మంత్రి పోచారం సమీక్ష..!!
2019 మార్చి మాసంలోగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ విభాగం కృషి చేస్తోంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తితో మాధాపూర్, జూబ్లీహిల్స్‌ల మధ్య గణనీయంగా దూరం తగ్గడంతో పాటు రంగురంగుల విద్యుత్ కాంతులతో మొట్టమొదటి హైదరాబాద్ హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందడంతో పాటుగా మంచి పర్యాటక ప్రాంతంగా రూపొందనుంది.
see also:ఘనంగా బోనాల పండుగ..!!
ఈ బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం 13 ఫౌండేషన్లు పూర్తికాగా 12 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. ప్రధాన బ్రిడ్జికి సంబంధించి మొదటి సెగ్‌మెంట్ రీ-ఇన్‌ఫోర్స్‌మెంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. స్టే-కేబుళ్లను ఆస్ట్రీయా దేశం నుండి ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది. బ్రిడ్జి బిల్డర్ పనులు పురోగతిలో ఉండగా, ట్రాక్ భీం ఫ్యాబ్రికేషన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి ప్రీ కాస్టింగ్ పనులు కొండాపూర్‌లో జరుగుతున్నాయని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు.
see also:పవన్ సంచలన ప్రకటన..కేసీఆర్‌ను త్వరలో కలుస్తా
25మీటర్ల పొడవు 6.5 మీటర్ల ఎత్తుతో ఉండే ప్రధాన బ్రిడ్జి పనులు కొండాపూర్‌లో ప్రీ కాస్టింగ్ నిర్మాణ పద్దతిలో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌లు నిరంతరం ఈ బ్రిడ్జి నిర్మాణ పనులపై సమీక్ష జరుపుతున్నారని కమిషనర్ తెలిపారు.
*కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో కలిగే సౌకర్యాలు…*
* హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు కేబుల్ బ్రిడ్జి ప్రత్యేక ఐకానిక్‌గా రూపొందనుంది.
* రోడ్డు నెంబర్ నెం 36, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లపై ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది.
* జూబ్లీహిల్స్ నుండి మైండ్‌స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది.
see also:రైతాంగానికి పెద్దన్నగా సీఎం కేసీఆర్
*రూ. 1421.70 కోట్ల విలువైన పనులకు టెండర్ల ఆహ్వానం*
గ్రేటర్ హైదరాబాద్‌లో సిగ్నల్ ఫ్రీ రహదారుల వ్యవస్థ రూపొందించడంలో భాగంగా చేపట్టిన ఎస్.ఆర్.డి.పిలో కొత్తగా రూ. 1421.70 కోట్ల వ్యయంతో చేపట్టే ఆరు ఫ్లైఓవర్లు, గ్రేడ్ సపరేటర్లకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానిస్తూ జీహెచ్ఎంసీ ప్రకటనలను విడుదల చేసింది. ఈ పీసి టర్న్‌కే పద్దతిలో టెండర్లను ఆహ్వానించిన పనుల వివరాలు…
see also:వచ్చే నెల 2 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ..!!
* రూ. 133.28 కోట్ల వ్యయంతో రేతిబౌలి జంక్షన్ నుండి నానల్‌నగర్ మీదుగా లంగర్‌హౌజ్ వద్దకు ఫ్లైఓవర్ నిర్మాణం నానల్ నగర్ వద్ద అండర్ పాస్ నిర్మాణం.
* రూ. 203.31 కోట్ల వ్యయంతో కొండాపూర్ నుండి ఔటర్ రింగ్ రోడ్ వైపు ఆరు లేన్ల ఇరువైపులా ఫ్లైఓవర్ నిర్మాణం-గచ్చిబౌలి జంక్షన్ నుండి గ్యాస్ కంపెనీ మీదుగా శిల్పా లే అవుట్ వరకు ఫ్లైఓవర్ల నిర్మాణం.
* రూ. 348.07 కోట్ల వ్యయంతో ఆరాంఘర్ నుండి జూపార్క్ వరకు ఆరులేన్ల గ్రేడ్ సపరేటర్ నిర్మాణం.
*రూ. 298.49 కోట్ల వ్యయంతో నల్గొండ క్రాస్ రోడ్ నుండి సైదాబాద్ ఐ.ఎస్. సదన్, ఓవైసీ జంక్షన్ వరకు కారిడార్ నిర్మాణం.
* రూ. 352.55 కోట్ల వ్యయంతో ఇందిరా పార్కు నుండి ఎన్.టి.ఆర్ స్టేడియం జంక్షన్, అశోక్ నగర్ క్రాస్ రోడ్ జంక్షన్, బాగ్ లింగంపల్లి జంక్షన్ మీదుగా వి.ఎస్.టి మెయిన్ రోడ్ వరకు నాలుగు లేన్ల బై-డెరెక్షనల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.
పై పనులు చేపట్టడానికి అంతర్జాతీయ టెండర్రలను ఆహ్వానిస్తూ జీహెచ్ఎంసీ ప్రకటనలు విడుదల చేసింది.