బోనాల పండుగను వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని రాష్ట్ర హోం శాఖమంత్రి నాయిని నరసింహా రెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి పద్మారావు గౌడ్, రాష్ట్ర పశు సంవర్థక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలతో కలసి బోనాల పండుగ ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
see also:ఆసుపత్రి బెడ్ మీద నుంచే అధికారులతో మంత్రి పోచారం సమీక్ష..!!
ఈ సందర్భంగా మంత్రి నాయిని నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగను జూలై 15 నుండి ఆగష్టు 6 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పండుగ ప్రశాంతంగా జరగడానికి అందరు సహకరించాలని కోరారు. పండుగ నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగంతో దేవాలయ కమిటీలు సహకరించాలని కోరారు. అన్ని శాఖలు సంబంధిత ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని దేవాలయాల సమీపంలోని రోడ్లకు రిపేర్లు చేయించాలని జి.హెచ్.యం.సి అధికారులను ఆదేశించారు. దేవాలయాలు, ఉరేగింపు జరిగే ప్రదేశాలలో విధిదీపాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు జి.హెచ్.యం.సి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు ట్రాన్స్ కో శాఖ అదనపు ట్సాన్స్ ఫార్మ ర్ల ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు విస్తృతమైన త్రాగు నీటి ఏర్పాట్లు చేయాలని, మురికి కాలువలను శుభ్రపరచి నీరు నిలువ ఉండకుండా జి.హెచ్.యం.సి, మెట్రో వాటర్ వర్క్స్ సంయుక్తంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
బోనాల పండుగను ఘనంగా జరుపుకోవడానికి రూ.15 కోట్లు కేటాయించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కృతఙతలు తెలిపారు.
see also:పవన్ సంచలన ప్రకటన..కేసీఆర్‌ను త్వరలో కలుస్తా
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగను జూలై 15 నుండి ఆగష్టు 6 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ జగదంబ మహంకాళి దేవాలయం గోల్కోండ కోట వద్ద జూలై 15 న , ఉజ్జయిని మహంకాళి దేవాలయం సికింద్రబాద్ వద్ద జూలై 29 న బోనాలు, జూలై 30 న రంగము మరియు ఏనుగు ఉరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పాత నగరంలో ఆగష్టు 5 న బోనాల పండుగను అ మరుసటి రోజు బోనాల ఉరేగింపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోనాల పండుగ జరుపుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.
see also:వచ్చే మార్చి నాటికి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దేవాలయ కమిటీలు పండుగ ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేశామని, ఈ కమిటీలు అన్ని శాఖల సమన్వయంతో నగరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.