Home / SLIDER / అసత్య ప్రచారం.. టీచర్లు నమ్మొద్దు..కడియం

అసత్య ప్రచారం.. టీచర్లు నమ్మొద్దు..కడియం

ప్రతి ఉపాధ్యాయుడికి వారి అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వెబ్ కౌన్సిలింగ్ చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు టీచర్ల బదిలీలను వెబ్ కౌన్సిలింగ్ లో చేయాలని చెప్పిన తర్వాత, ఉపాధ్యాయ జేఏసీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలను అంగీకరించిన మేరకే ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. వెబ్ కౌన్సిలింగ్ లో లోపాలున్నాయని, ఈ విధానం వద్దని గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప్రచారంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి స్పష్టత ఇచ్చారు.

see also:తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత మొద‌ట లాభ‌ప‌డ్డ జిల్లా నిజామాబాదే

గత కొంతకాలంగా ఉపాధ్యాయ బదిలీలు లేక టీచర్లు ఇబ్బంది పడుతుండడంతో, ముఖ్యమంత్రి కేసిఆర్ సాధారణ ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతించారని, అయితే ఇవి పారదర్శకంగా నిర్వహించేందుకు వెబ్ కౌన్సిలింగ్ జరపాలని సిఎం సూచించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సిఎం కేసిఆర్ ప్రకటన తర్వాత రెండుసార్లు మే నెల 21, జూన్ 2న ఉపాధ్యాయ జేఏసీలతో సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశాల్లో ఉపాధ్యాయ సంఘాలు వెబ్ కౌన్సిలింగ్ కు అంగీకరించాయని, దీంతో పాటు పదోన్నతులు కూడా చేపట్టాలని విజ్ణప్తి చేసినట్లు తెలిపారు. అయితే ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుల అంశం కోర్టులో ఉన్నందున, మేనేజ్ మెంట్స్ వారిగా పదోన్నతులు కూడా వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే చేద్దామని చెప్పామన్నారు. దీనికి ఉపాధ్యాయ జేఏసీలు అంగీకరించిన తర్వాతే జూన్ 6వ తేదీన ఉపాధ్యాయుల బదిలీలపై జీవో 16ను తీసుకొచ్చామన్నారు. అయితే మళ్లీ ఉపాధ్యాయ సంఘాలు వచ్చి ఒకేసారి ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్.జీ.టీలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని, వేర్వేరుగా నిర్వహించాలని కోరడంతో దానికి అంగీకరించామన్నారు. ఈ మేరకే ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్.జీ.టీలకు వేర్వేరుగా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం కౌన్సిలింగ్ కు 75,318 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. జీవో 16కు అనుగుణంగా సీనియారిటీ జాబితా, ఖాళీల జాబితా రూపొందించి వెల్లడించామన్నారు.

see also:కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక‌య్యే పంచ్ వేసిన మంత్రి కేటీఆర్

ఈ జాబితాల రూపకల్పనలో పొరపాట్లు ఉన్నట్లు తమ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాటిని సరిదిద్దామన్నారు. కొంతమంది తప్పుడు పత్రాలు పెట్టారని తెలిసిన వెంటనే వాటిని కూడా సరిదిద్ది తుది జాబితా వెల్లడించామన్నారు. ఉపాధ్యాయ జేఏసీలు చెప్పినట్లుగానే వేర్వేరుగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్.జీ.టీలకు బదిలీలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియలో ఇంత దూరం వచ్చాక ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ వద్దని కొంతమంది ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. కొంతమంది వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించవద్దని కోర్టుకు వెళ్తున్నారని, ఇతర కారణాలతో కూడా కోర్టుకు వెళ్లారని వివరించారు. కోర్టులో ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల వాదనలు విన్నతర్వాత తీర్పును ఈ నెల 26వ తేదీకి రిజర్వ్ చేశారని చెప్పారు. ఈలోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేశామన్నారు. వెబ్ కౌన్సిలింగ్ లో బదిలీల నిర్వహణను ప్రధానోపాధ్యాయుల సంఘం హర్షించిందన్నారు. మొత్తం 2193 ప్రధానోపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే, 2181 మంది ఆప్షన్లు ఇచ్చారని చెప్పారు. కేవలం 4 ప్రధానోపాధ్యాయులు తప్పనిసరి బదిలీ కావల్సిన జాబితాలో ఉండి, ఆప్షన్స్ ఇచ్చుకోలేదన్నారు. మిగిలిన వారందరూ సజావుగా చేసుకున్నారని తెలిపారు.

see also:పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం కేసీఆర్

జూన్ 24వ తేదీ నుంచి స్కూల్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమైందని, ఇందులో 31,961 మంది దరఖాస్తు చేసుకుంటే 27,750 మంది కౌన్సిలింగ్ లో పాల్గొన్నారని చెప్పారు. అయితే వెబ్ కౌన్సిలింగ్ లో ఇచ్చిన ఆప్షన్లు మారుతున్నాయని, కొంతమంది యూనియన్ నేతలు ప్రచారం చేయడం వల్ల చాలామంది గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. దీనివల్ల ప్రధానోపాధ్యాయులు కూడా తమ ఆప్షన్లు ఏమైనా మారాయా? అనే అనుమానంతో మళ్లీ వెబ్ సైట్ కు లాగిన్ కావడం వల్ల సర్వర్లు డౌన్ అయ్యాయని చెప్పారు. ప్రభుత్వానికి సహకరించాల్సిన వాళ్లు, బాధ్యతగా ఉండాల్సిన వాళ్లే ప్రభుత్వాన్ని నేడు బదనాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగున అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దంటూ నా వ్యక్తిగత ఫోన్ కు వేల మెస్సేజ్ లు, వందల కాల్స్ చేయిస్తున్నారని బాధ పడ్డారు. ఈ మెస్సేజ్ లు ఎక్కడి నుంచి పెట్టిస్తున్నారో విచారణ చేయించి, తర్వాత తగు చర్యలు తీసుకుంటామన్నారు.

see also:ఆదాయాభివృద్ధి రేటులో రికార్డ్ సృష్టించిన తెలంగాణ

వెబ్ కౌన్సిలింగ్ వద్దనే ఉద్దేశ్యంతో కొంతమంది యూనియన్ నాయకులు చేసే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఉపాధ్యాయులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ణప్తి చేశారు. ఉపాధ్యాయులందరికీ వారి అర్హత మేరకు న్యాయం జరగాలన్నదే తమ ప్రయత్నమన్నారు. వెబ్ కౌన్సిలింగ్ లో ఎవరి జోక్యం ఉండదని, ఆప్షన్లు మారవని స్పష్టం చేశారు. స్కూల్ అసిస్టెంట్ల కౌన్సిలింగ్ లో ఈ రోజు జరిగిన సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో ఒకరోజు దీనిని పొడగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో షెడ్యూల్ రివైజ్ అవుతుందని చెప్పారు.
తెలుగు భాషా తప్పనిసరి అమలుకు సంబంధించి 1వ తరగతి, 6వ తరగతి పుస్తకాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్య ఇన్ ఛార్జీ కమిషనర్ అదర్ సిన్హ, విద్యాశాఖ సంక్షేమ, మౌలికవసతుల అభివృద్ధి సంస్థ ఎండీ విజయ్ కుమార్, టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ ప్రెస్ డైరెక్టర్ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat