తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ లకు సవాల్ విసిరారు.సూర్యాపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి లెక్కలను వివరిస్తామని..ప్రతిపక్షాలకు సత్తా ఉంటే చర్చకు రావాలని మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ కాసరబాద్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మగాంధీ విగ్రహ ఆవిష్కరణతో పాటు రూ. రూ. 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన గామపంచాయతీ భవనాన్నిజగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడారు.
see also:ఫైవ్‌స్టార్ హోటల్‌లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి కేటీఆర్
వేలకోట్ల రూపాయలతో సూర్యాపేటలో అభివృద్ధి పనులు జరుగుతుంటే విపక్షాలు ఓర్వలేక విమర్శిస్తున్నాయని మంత్రి ధ్వజమెత్తారు. గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఖర్చు చేయలేని నాయకులు, ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం ప్రజల ముందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు.టీ ఆర్ ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో లో పెట్టిన హామీలను 100 శాతం నెరవేర్చిందని ఆయన చెప్పారు.