ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో చూసినా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబు సర్కార్ పాలన ముగింపు గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలోని అన్ని పార్టీల ప్రధాన నేతలు ఇప్పట్నుంచే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.
see also:జగన్ తీసుకున్న నిర్ణయంతో.. 2019లో వార్ వన్ సైడ్..!
అందులో మొదటగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ప్రజా సంకల్ప యాత్రను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. అంతకు ముందు నుంచే అను నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారికి భరోసా కల్పిస్తున్నారు వైఎస్ జగన్. మరో పక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేతలు పల్లెబాటలు పడుతూ చంద్రబాబు సర్కార్ అవినీతి, కుంభకోణాల పాలనను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు.
see also:కేసీఆర్‌ను కెలికి గాలి తీసుకున్న బాబు
ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు సంస్థలు చేసిన సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే. రహిముల్లాఖాన్ అనే జ్యోతిష్కుడు, రిపబ్లికన్ టీవీ వారు, ప్రశాంత్ కిశోర్, ఏపీ ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వేలన్నీ అందులో భాగమే. వీరు చేసిన సర్వే ఫలితాలు 2019లో వైసీపీ వందకుపైగా అసెంబ్లీ స్థానాలను గెలుపొందుతుందని తేల్చి చెప్పాయి.
see also:వైఎస్ జగన్ 199వ రోజు పాదయాత్ర..!
ఇప్పుడు ఆ జాబితాలో గూగుల్ సర్వే కూడా చేరిపోయింది. ఏపీ నెక్ట్స్ సీఎం వైఎస్ జగన్ అంటూ కుండబద్దలు కొట్టింది గూగుల్ సర్వే. అయితే, హు ఈజ్ ద ఏపీ నెక్స్ట్ సీఎం..? అని గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో టైప్ చేయగానే వైఎస్ జగన్ అని పేరు చూపించడంతోపాటు ఫోటోలను సైతం చూపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత ఏపీ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారో..? అన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.