మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఇప్పటికే చాలా మంది యువ హీరోలు వచ్చేశారు. ఎవరి స్థాయిలో.. వారికంటూ ఉన్న టాలెంట్‌తో ముందుకు వెళుతున్నారు.ప్రతీ ఒక్కరూ వారికంటూ ఒక మార్కెట్‌ను సెట్ చేసుకున్నారు. అయితే, మెగాస్టార్ వారసుడిగా రామ్‌చరణ్ ఉన్నారు. పెద్ద కూతురు సుప్రియ కూడా స్టైలిష్ డిజైనర్‌గా తానేంటో ఇప్పటికే నిరూపించుకుంది. మెగాస్టార్ రీ ఎంట్రీ ఖైదీ నెం.150 సినిమాతో ఆమెకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.
see also:కేవలం.. డబ్బుల కోసమే ఆ పని చేశా..!
అయితే, మెగా ఫ్యామిలీలో అందరికీ అండగా ఉండే చిరంజీవి చిన్నకూతురు శ్రీజ విషయంలో చాలా ఆలోచించే చేశారు. శ్రీజ కూడా అందరిలానే ఉండాలనే తలంపుతో ఆమె భర్తను హీరోగా చేసే బాధ్యతను చిరంజీవి తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా శ్రీజ భర్త ను హీరోగా పరిచయం చేస్తూ విజేత చిత్రాన్ని తెరకెక్కించారు. చివరకు తాను నటిస్తున్న సైరా చిత్రాన్ని సైతం పక్కన పెట్టి శ్రీజ భర్త కల్యాణ్‌దేవ్ నటిస్తున్న చిత్రం కోసమే చిరంజీవి ఎక్కువ సమయం కేటాయించారట. ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది.