Home / MOVIES / చికాగో సెక్స్‌రాకెట్ :శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా క‌రెన్సీ ఎక్సేంజ్‌..!

చికాగో సెక్స్‌రాకెట్ :శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా క‌రెన్సీ ఎక్సేంజ్‌..!

అమెరికా కేంద్రంగా టాలీవుడ్ హీరోయిన్లు, యాంక‌ర్లకు సంబంధించి ఇటీవ‌ల వెలుగులోకి వ‌చ్చిన విష‌యాలు సంచ‌ల‌నాలు రేపుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో చిన్న‌, మ‌ధ్య స్థాయిహీరోయిన్ల‌తోపాటు కొంద‌రు యాంక‌ర్లు ఉన్న‌ట్టుగా వెల్ల‌డ‌వుతోంది. అయితే, యూఎస్ పోలీసులు ఈ సెక్స్ రాకెట్ గుట్టు బ‌య‌ట‌పెట్ట‌డానికంటే ముందు ఈ వ్య‌వ‌హారంపై హైద‌రాబాద్ పోలీసుల‌కే సందేహాలు క‌లిగాయ‌ట‌. అమెరికాలో ఈవెంట్ల‌లో పాల్గొనేందుకు వెళ్లిన హీరోయిన్లు, యాంక‌ర్లు పెద్ద‌మొత్తంలోని డాల‌ర్ల‌ను రూపాయ‌ల్లోకి మార్చుకోవ‌డాన్ని కొంత‌కాలంగా పోలీసులు గ‌మ‌నిస్తున్నారు. కొన్ని నెల‌ల కింద‌ట ఒక హీరోయిన్ యూఎస్‌కు వెళ్లే స‌మ‌యంలో.. ఉత్త చేతుల‌తో వెళ్లి.. తిరిగి వ‌చ్చే స‌మ‌యంలో భారీ మొత్తంలో కరెన్సీని రూపాయ‌ల్లోకి ఎక్సేంజ్ చేసింద‌ట‌.

see also:కూతురి కోసం సైరాను ప‌క్క‌న పెట్టేసిన మెగాస్టార్‌..!

తెలుగులో రెండు సినిమాలు, క‌న్న‌డ‌లో నాలుగు సినిమాలు చేసిన ఆ హీరోయిన్‌కు ఆ డ‌బ్బులు ఎలా వ‌చ్చాయ‌న్న‌ది ఎవ‌రికీ అర్థం కాలేదు. పోనీ ఆమోకు హాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లేమ‌న్నా వ‌చ్చాయంటే.. అదేమీ కాదు. అలాగ‌ని యూఎస్‌కు ఆమెకు వ్యాపార సంస్థ‌లు ఉన్నాయా..? అంటే అవీ కూడా లేవు. ఇదే అంశాన్ని మా అసోసియేష‌న్ అధ్య‌క్షుడు శివాజీ రాజా లేవ‌నెత్తాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆ స్టార్ హీరోయిన్ అంత పెద్ద మొత్తంలో క‌రెన్సీ ఎక్సేంజ్ చేసుకోవ‌డం వెనుక ర‌హ‌ష్య‌మేంట‌ని శివాజీ రాజా ప్ర‌శ్నించారు. ఈ అంశంపైనే పోలీసులు ఇప్పుడు విచార‌ణ‌ను వేగ‌వంతం చేశార‌ట‌. ఈ విష‌యంపైనే యూఎస్ పోలీసులు హైద‌రాబాద్ పోలీసుల సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది.

see also:కేవ‌లం.. డ‌బ్బుల కోస‌మే ఆ పని చేశా..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat