ఏపీలోని చంద్రబాబు సర్కార్‌పై, అలాగే, టీడీపీ ప్రభుత్వానికి వంత పాడుతున్న ఎల్లో మీడియాపై గడ్డం ఉమా అనే మహిళ తనదైన శైలిలో స్పందించింది. అయితే, ఇటీవల కాలంలో టీడీపీ నేతలు వైసీపీపై లేనిపోని ఆరోపణలతో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటిగా.. బీజేపీతో వైసీపీ పొత్తు కుదుర్చుకుందని, అందులో భాగంగానే ప్రధాని మోడీని సైతం జగన్ ఏమీ అనడం లేదని సీఎం చంద్రబాబు నుంచి టీడీపీ నాయకుల వరకు వైసీపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
see also:చంద్రబాబు.. జగన్ ఫాలోవర్ – తేల్చి చెప్పిన ప్రొ.నాగేశ్వరరావు..!
అలా, టీడీపీ నేతలు గుప్పతిస్తున్న విమర్శలకు గడ్డం ఉమా అనే మహిళ తన దైన శైలిలో సమాధానం చెప్పింది. అసలు బీజేపీతో వైసీపీ పొత్తు ఉందా..? లేదా..? అన్న టీడీపీ నేతల ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చింది. నిజంగా, బీజేపీతో వైసీపీ పొత్తు ఉంటే వైసీపీ ఎంపీల రాజీనామాలను పార్లమెంట్ స్పీకర్ ఆమోదించరని, పొత్తు లేదుకాబట్టే వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించడం జరిగిందని స్పష్టం చేసింది. సర్పంచ్ పదవిని సైతం వదులుకునేందుకు ఇష్టపడిని ఈ రోజుల్లో.. ప్రత్యేక హోదా కోసం తృణప్రాయంగాఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన వైసీపీ సభ్యులను అభినందించాల్సింది పోయి.. విమర్శలు గుప్పించడం సరికాదని పేర్కొంది.
see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన విజయం
అంతేకాకుండా, బీజేపీతో టీడీపీ పొత్తు ఇంకా కొనసాగుతోందని, అందుకు కూడా తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది గడ్డం ఉమా. బీజేపీ, టీడీపీ పొత్తు కొనసాగుతుందనడానికి ఆధారం టీడీపీలోకి ఫిరాయించిన వైసీపీ ఎంపీలను సస్పెండ్ చేయకపోవడమే తెలిపింది. ఒక వేళ బీజేపీతో వైసీపీ పొత్తు ఉండి ఉంటే.. టీడీపీలోకి ఫిరాయించిన వైసీపీ ఎంపీలను ఎప్పుడో సస్పెండ్ చేసి ఉండేవారని, బీజేపీతో వైసీపీ పొత్తు లేదు కాబట్టే.. టీడీపీలో కొనసాగుతున్న వైసీపీ ఎంపీలను సస్పెండ్ చేయకుండా, టీడీపీలోనే కొనసాగేలా స్పీకర్ కాపాడుతున్నారని గడ్డం ఉమా తెలిపింది.