ఎవరైతో రాజకీయాల్లో ఎజెండా సెట్ చేస్తారో.. చివరకు వారే లాభపడతారు. ఈ అంశాన్నే ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొ.నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అందుకు ఉదాహరణలను కూడా ప్రొ.నాగేశ్వరరావు చెప్పారు. అవేమిటంటే.. 2014 సాధారణ ఎన్నికల్లో జరిగిన అంశాలను ఆయన ప్రస్తావించారు. బీజేపీ తరుపున ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ ఎజెండా సృష్టిస్తూ వస్తే.. ప్రత్యర్థులు ఆ ఎజెండాపై స్పందిస్తూ జనాల్లోకి తీసుకెళ్లారన్నారు. అలాగే, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎజెండాను సృష్టిస్తే.. ఆ ఎజెండాను ప్రత్యర్థులు తమ విమర్శల ద్వారానే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని ప్రొ.నాగేశ్వరరావు గుర్తు చేశారు. ఈ అంశాలను బేరీజు వేసుకుని ముందుగా ఎవరు ఎజెండా సెట్ చేస్తే.. ఆ నాయకుడే చివరకు లాభ పడతాడని తేల్చి చెప్పారు.
see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన విజయం
ఇక అసలు విషయానికొస్తే.. సీఎం చంద్రబాబు ఏపీ ప్రధాన పరతిపక్ష నేత జగన్ ఫాలోవర్ అన్న అంశాన్ని ప్రొ.నాగేశ్వరరావు ఆధారాలతో సహా రుజువు చేశారు. అందుకు ఆయ ప్రధానంగా ఐదు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఓ సారి వాటిని పరిశీలిస్తే..
1. ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదా అంశంలో వైఎస్ జగన్ రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ఒకే మాట మీద ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా సాధనతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని వైఎస్ జగన్ నాటి నుంచి నేటి వరకు పోరాడుతున్నారు. అందులో భాగంగానే పార్లమెంట్ వేదికగా తమ పార్టీ వైసీపీ ఎంపీల చేత రాజీనామా కూడా చేయించారు.
see also:ఆందోళనకరంగా సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి..!
అయితే, ప్రత్యేక హోదా అంశంలో సీఎం చంద్రబాబు రెండునాల్కుల ధోరణి అవలంభించిన విషయాన్ని ఏపీ ప్రజలు గుర్తించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో హోదాతోనే అభివృద్ధి సాధ్యమని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు.. తీరా అధికారం చేపట్టాక ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా అని ఎదురు ప్రశ్నిస్తూ ప్రత్యేక ప్యాకేజీకే మొగ్గు చూపారు చంద్రబాబు. మరో పక్క ప్రత్యేక హోదాపై పోరాడుతున్న వైఎస్ జగన్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు చివరకు తాను కూడా ప్రత్యేక హోదా ఉద్యమం కావాలంటూ కొద్ది రోజుల క్రితం నుంచి పోరాటాన్ని ఉధృతం చేశారు.
see also:వైసీపీలో చేరనున్న మాజీ సీఎం ప్రియ శిష్యుడు..!
2. బీజేపీతో టీడీపీ పొత్తు
నాలుగేళ్లపాటు బీజేపీతో పొత్తుపెట్టుకుని, ఏపీకి ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చని చంద్రబాబు సర్కార్‌ను ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే, చంద్రబాబు మాత్రం ఎన్టీయేలో భాగస్వామిగా, మంత్రి పదవుల్లో ఉంటూ కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నామంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వంలో ఉంటేనే కదా రాష్ట్రానికి ఏమైనా తేగలిగేది అంటూ అప్పటి వరకు మధ్యపెడుతూ వచ్చిన చంద్రబాబు చివరకు జగన్ చెప్పిన విధంగానే.. కేంద్ర ప్రభుత్వంలోని తమ మంత్రుల చేత రాజీనామా చేయించారు.
see also:ఏపీ రాజకీయ పార్టీల భవిష్యత్ తేల్చేసిన గూగుల్ సర్వే..!
3.కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడంలోనూ వైసీపీనే ముందు ముందుకొచ్చింది. అయితే, అంతకు ముందు చంద్రబాబు తీరు హాస్యాస్పదమని ప్రొ.నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అవిశ్వాసం పెడితే లాభం లేదని ఒకసారి.. అవిశ్వాసం పెడితే వైసీపీకి మద్దతు ఇస్తామని మరోసారి, లేదు.. లేదు.. మేమే అవిశ్వాసం పెడతామంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం బాధాకరమని ప్రొ.నాగేశ్వరరావు పేర్కొన్నారు.
see also:వైఎస్ జగన్ 199వ రోజు పాదయాత్ర..!
4. మైనర్ బాలికపై అత్యాచారం ఘటన
గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామంలో ఓ మైనర్ బాలికపై అత్యాచార ఘటన జరిగిన వెంటనే ఇకపై అటువంటి ఘటనలు చోటుచేసుకోకూడదని, నిందితులకు కఠిన శిక్ష విధించాలనివైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. కానీ, అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ మాత్రం ఘటన జరిగిన మరుసటి రోజున ప్రదర్శనకు పిలుపునిచ్చింది. వైసీపీ కంటే టీడీపీ ముందుగా ఈ ఘటనపై స్పందించి ర్యాలీలకు పిలుపునిచ్చి ఉంటే చంద్రబాబు తన తాహతును నిలబెట్టుకుని ఉండేవాడని ప్రొ.నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.