తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఘనంగా జరిగే బోనాల పండుగ ఏర్పాట్లు, నిర్వహణ కోసం రూ.15 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను సోమవారం ఆదేశించారు. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిఎం కోరారు. నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, సమన్వయం చేయాలని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డిని ఆదేశించారు.
Tags BONALA PANDUGA CM KCR HYD